
సాక్షి ప్రతినిధి, చెన్నై: జయలలిత మరణంపై తమిళనాడు ప్రభుత్వం నియమించిన విచారణ కమిషన్ ముందు ఆ రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి రామమోహన్‌రావు హాజరయ్యారు. జయలలిత సీఎంగా ఉన్న కాలంలో ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. గురువారం కమిషన్ కార్యాలయానికి వచ్చి కమిషన్ చైర్మన్ ముందు హాజరయ్యారు. స్పృహలో ఉన్న స్థితిలోనే జయ ఆస్పత్రికి వచ్చారా? అడ్మిట్ చేయడానికి అసలుకారణాలేంటి? చికిత్సకు సంబంధించి తప్పుల తడకలుగా బులెటిన్లు ఎందుకు విడుదల చేశారు? తదితర ప్రశ్నలు వేసినట్లు సమాచారం.