జాతీయ స్థాయి క్రీడాకారిణి ఆత్మహత్య | Denied Hostel, National-Level Player Allegedly Commits Suicide In Punajb | Sakshi
Sakshi News home page

జాతీయ స్థాయి క్రీడాకారిణి ఆత్మహత్య

Aug 21 2016 10:56 AM | Updated on Sep 4 2017 10:16 AM

జాతీయ స్థాయి క్రీడాకారిణి ఆత్మహత్య

జాతీయ స్థాయి క్రీడాకారిణి ఆత్మహత్య

రియో ఒలింపిక్స్ లో మహిళలు పతకాలు సాధిస్తూ దేశానికి గర్వంగా నిలుస్తున్న వేళ ఓ జాతీయ స్థాయి హ్యాండ్ బాల్ క్రీడాకారిణి ఆత్మహత్య చేసుకుంది.

పాటియాలా: రియో ఒలింపిక్స్ లో మహిళలు పతకాలు సాధిస్తూ దేశానికి గర్వంగా నిలుస్తున్న వేళ ఓ జాతీయ స్థాయి హ్యాండ్ బాల్ క్రీడాకారిణి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన పంజాబ్ లోని పాటియాలాలో శనివారం చోటు చేసుకుంది. పాటియాలా లోని ఖల్సా కళాశాలలో పూజ (20)  ద్వితీయ సంవత్సరం  చదువుతోంది. ఆమె గతేడాది కళాశాలలో అడ్మీషన్ తీసుకుంది. కాలేజీలోచేరే సమయంలో  ఉచితంగా హాస్టల్ సౌకర్యం కల్పిస్తామని కళాశాల యాజమాన్యం హామీ ఇచ్చారు. 

ఆమె ఇంటినుంచి కాలేజీకి రావడానికి రోజూ రూ.120 ఖర్చు అవుతుంది.కూరగాయలు  అమ్మి కుటుంబాన్ని పోషించే తండ్రి ఖర్చులు భరించలేనని చదువు మానేయాల్సిందిగా పూజాకు  సూచించాడు    దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన పూజ నాలుగు పేజీల సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకుంది. ఇందులో ప్రధానమంత్రి నరేంద్రమోదీగారూ నాలాంటి పేద విద్యార్థులకు సరైన సౌకర్యాలు కల్సించడి అని రాసింది. కళాశాల లో హాస్టల్ వసతి ఇవ్వనందుకే బలవన్మరణానికి పాల్పడిందని పోలీసులు వెల్లడించారు. కేసును నమోదు చేసిన పోలీసులు కేసును విచారిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement