
'నీతివంతమైన ప్రభుత్వాన్ని కోరుకున్నారు'
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ సొంతంగానే ప్రభుత్వాన్నే ఏర్పాటు దిశగానే పయనిస్తోంది.
న్యూఢిల్లీ:ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ సొంతంగానే ప్రభుత్వాన్నే ఏర్పాటు దిశగానే పయనిస్తోంది.ఈ ఎన్నికల్లో ఆప్ అనుకున్న సీట్లకంటే అత్యధిక స్థానాల్లో దూసుకుపోతుండటంతో ఆ పార్టీ నేతలు ఆనందంలో మునిగితేలుతున్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఫలితాలు ఆప్ అనుకూలంగా ఉండటంతో ఆ పార్టీ నేత మనీష్ శిసోడియా సంతోషం వ్యక్తం చేశారు.
ఈ ఎన్నికల్లో ప్రజలు నీతివంతమైన ప్రభుత్వానికే మొగ్గు చూపారని ఆయన అన్నారు.'ఢిల్లీ ప్రజలు నీతివంతమైన ప్రభుత్వాన్ని కోరుకున్నారు.మా వద్ద ఢిల్లీ అభివృద్ధి కొరకు పక్కా ప్రణాళిక ఉంది. ఢిల్లీ కి స్వచ్ఛమైన పాలన ఇవ్వడానికి మంచి నాయకుడ్ని కల్గి ఉన్నాం'అని మనీష్ తెలిపారు.