ఏడంతస్తుల ఎత్తులో | Sakshi
Sakshi News home page

ఏడంతస్తుల ఎత్తులో

Published Sat, Sep 27 2014 12:30 AM

ఏడంతస్తుల ఎత్తులో - Sakshi

నగరవాసులు మెట్రో రైలు ప్రయాణాన్ని త్వరలో మరింత ఆస్వాదించనున్నారు. ఇందుకు కారణం మూడో దశలో భాగంగా ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్‌సీ).... నగరంలోని దౌలాకువాన్ ప్రాంతంలో త్వరలో మెట్రో  రైళ్లను 23.6 మీటర్ల ఎత్తున నడపనుండడమే.

దౌలాకువాన్ వద్ద 23 మీటర్ల పొడవైన మెట్రో పిల్లర్లు
న్యూఢిల్లీ: మెట్రో మూడో దశలో భాగంగా మజ్లిస్ పార్కు-శివ్‌విహార్ కారిడార్‌లో భాగంగా దక్షిణ క్యాంపస్- ఢిల్లీ కంటోన్మెంట్ స్టేషన్ల మధ్య వయాడక్ట్ నిర్మాణం జరుగుతోంది. దీని పొడవు 59 కిలోమీటర్లు. దీని కిందనే దౌలాకువాన్ ప్రాంతంలో ఎయిర్‌పోర్ట్ ఎక్స్‌ప్రెస్ మార్గముంది. ఈ మార్గంలో నిత్యం రాకపోకలు సాగించే మెట్రో రైళ్లకు ఎంతమాత్రం అంతరాయం కలగకుండా ఇంజనీర్లు, సిబ్బం ది ఈ పనులను ఆగమేఘాల మీద కొనసాగిస్తున్నా రు.

ఈ విషయమై ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్‌సీ) కార్పొరేట్ కమ్యూనికే షన్స్ కార్యనిర్వాహక సంచాలకుడు అనుజ్ దయాళ్ మాట్లాడు తూ ‘దౌలాకువాన్ ప్రాంతంలో నిర్మిస్తున్న మెట్రో రైలు స్థంభాల ఎత్తు దాదాపు ఏడు అంతస్తుల ఎత్తు లో ఉంటాయి.  ఇది నగరంలోనే అత్యం త ఎత్తయిన మార్గం కానుంది. గతంలో కర్కర్‌డుమా ప్రాంతం లో నిర్మించిన మెట్రో మార్గం ఎత్తు 19 మీటర్లు’అని అన్నారు.  

ఎయిర్‌పోర్టు మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలగకుండా ఉండేం దుకుగాను రాత్రి గం 12.30 నుంచి ఉదయం నాలు గు గంటలవరకూ మాత్రమే ఎయిర్‌పోర్టు లైన్‌పైన పనులను చేపడుతున్నామన్నారు.ఈ సమయంలో ఎయిర్‌పోర్ట్ ఎక్స్‌ప్రెస్ మార్గంలో ఎటువం టి కార్యక్రమాలకు అనుమతి ఉండబోదన్నారు. ప్రయాణికుల సౌకర్యం కోసం డైవర్షన్ రోడ్డును కూ డా నిర్మించామన్నారు. ఎయిర్‌పోర్ట్ లైన్ కార్యకలాపాలు, నిర్వహణ విభాగం నుంచి అన్పి అనుమతు లూ పొంది న తర్వాతే పనులను ప్రారంభించామన్నారు.
 
తగు భద్రతా చర్యలు
దక్షిణ క్యాంపస్- ఢిల్లీ కంటోన్మెంట్ స్టేషన్ల మధ్య వయాడక్ట్ పనులను చేపట్టిన నేపథ్యంలో దీని కింది భాగంలో పనిచేసే సిబ్బందితోపాటు రైళ్లకు భద్రత కల్పించేందుకుగాను డీఎంఆర్‌సీ తగు భద్రతా చర్య లు తీసుకుంది. ఇందులోభాగంగా ఎయిర్‌పోర్ట్ మార్గంలోని వివిధ ప్రాంతాల్లో సీసీ టెలివిజన్ కెమెరాలను ఏర్పాటుచేసింది. దీంతోపాటు ఆరుగురు సివిల్ ఇంజనీర్లు, ఇద్దరు భద్రతా నిపుణులు, కార్యకలాపాలు, నిర్వహణ విభాగానికి చెందిన ఇంజనీర్లు, ఇతర నిపుణులతో కూడిన ఆరు బృందాలను ఏర్పాటుచేసింది.
 
ఈ బృందాలు కన్నార్పకుండా తమ తమ బాధ్యతలను నిర్వర్తిస్తున్నాయి. ఎయిర్‌పోర్ట్ ఎక్స్‌ప్రెస్ మార్గంలోని ప్రస్తుత వయాడక్ట్, ఓవర్ ఎలక్ట్రిఫికేషన్ (ఓహెచ్‌ఈ)లపై సెగ్మెంట్లను ఏర్పాటుచేసే సమయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ప్రస్తుతం కింది మార్గంలో మెట్రో రైళ్ల రాకపోకలు కొనసాగుతున్న నేపథ్యంలో వాటికి ఎటువంటి నష్టం వాటిల్లకుండా జాగ్రత్తపడుతున్నాయి.

Advertisement
Advertisement