ఆసుపత్రిలో చేరిన ఢిల్లీ ఆరోగ్య మంత్రి | Delhi Health Minister Admitted To Hospital  | Sakshi
Sakshi News home page

ఆసుపత్రిలో చేరిన ఢిల్లీ ఆరోగ్య మంత్రి

Jun 16 2020 10:11 AM | Updated on Jun 16 2020 2:16 PM

Delhi Health Minister Admitted To Hospital  - Sakshi

ఫైల్ ఫోటో

సాక్షి, న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి ఢిల్లీ ప్రభుత్వాన్ని వణికిస్తోంది. కరోనా వైరస్ అనుమానిత లక్షణాలతో ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్  నిన్న(సోమవారం) రాత్రి రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో చేరారు. అధిక జ్వరం, శ్వాస సమస్యలతో బాధపడుతున్న ఆయనకు చికిత్స అందిస్తున్నారు. కోవిడ్-19పరీక్ష చేసిన వైద్యుల ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ విషయాన్ని  జైన్ స్వయంగా ట్విటర్ ద్వారా వెల్లడించారు. గత రాత్రి  హై గ్రేడ్ జ్వరం, ఆక్సిజన్ స్థాయి అకస్మాత్తుగా పడిపోవటంతో ఆసుపత్రిలో చేరానని ఆయన ట్వీట్ చేశారు. 

కాగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అనారోగ్యం కారణంగా ఇటీవల స్వీయ నియంత్రణలోకి వెళ్లారు.  అయితే అనంతరం ఆయనకు నిర్వహించిన  కోవిడ్-19 పరీక్షల్లో నెగిటివ్ రావడంతో అంతా ఊపిరి పిల్చుకున్న సంగతి తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement