వాటిపై నిషేధం ఏడాది పొడిగింపు

Delhi Govt Extends Ban On Manufacture And Sale Of Gutkha Pan Masala - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : గుట్కా, పాన్‌ మసాలా, పొగాకు ఉత్పత్తుల తయారీ, నిల్వ, విక్రయాలపై విధించిన నిషేధాన్ని ఢిల్లీ ప్రభుత్వం మరో ఏడాది పొడిగించింది. ఈ ఉత్పత్తులపై నిషేధాన్ని పొడిగిస్తూ ఫుడ్‌ సేఫ్టీ విభాగం శుక్రవారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఫుడ్‌ సేఫ్టీ కమిషనర్‌ ఎల్‌ఆర్‌ గార్గ్‌ నోటిఫికేషన్‌ను జారీ చేశారు.

ప్రజారోగ్య ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుని గుట్కా, పాన్‌ మసాలాతో సహా పొగాకు ఉత్పత్తులన్నింటిపై విధించిన నిషేధాన్ని ఢిల్లీ, జాతీయ రాజధాని ప్రాంతాల్లో మరో ఏడాది పొడిగిస్తున్నట్టు ఫుడ్‌ సేఫ్టీ కమిషనర్‌ జారీ చేసిన నోటిఫికేషన్‌ వెల్లడించింది. అయితే సిగరెట్లపై అలాంటి నిషేధం విధించే ఉద్దేశం లేదని అధికార వర్గాలు పేర్కొనడం గమనార్హం.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top