ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును తమ పార్టీ గౌరవిస్తుందని కాంగ్రెస్ నేత పీసీ ఛాకో అన్నారు.
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు 2015 ఫలితాల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును తమ పార్టీ గౌరవిస్తుందని కాంగ్రెస్ నేత పీసీ ఛాకో మంగళవారం వ్యాఖ్యానించారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్దే పైచేయి అంటూ ఎగ్జిట్ ఫోల్స్ వెల్లడించిన నేపథ్యంలో ఆ లెక్క తప్పు కాదని తాను అభిప్రాయ పడుతున్నట్టు చెప్పారు. ఎగ్జిట్ ఫోల్స్ ఫలితాలు కాంగ్రెస్కు భిన్నంగా ఉన్నప్పటికీ తుది ఫలితాలు బయటకు వచ్చిన తరువాత పార్టీ పరంగా ఏదైనా నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు.
ఈ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో అంతా అయిపోలేదని, ముందు మునిషిపల్ ఎన్నికలు ఉన్నాయంటూ చాకో గుర్తు చేశారు. ఈ మునిషిపల్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ ఓడిపోయినట్లయితే ప్రజల తీర్పుకు కట్టుబడుతామన్నారు. ఆపై ప్రజలలో నమ్మకం కలిగించేలా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి కృషిచేస్తామని చాకో తెలిపారు.