
అందరి చూపు హస్తిన వైపే...
దేశవ్యాప్తంగా అందరి కళ్లు హస్తన వైపే. అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ నేపథ్యంలో ఢిల్లీలో వాతావరణం వేడెక్కింది.
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా అందరి కళ్లు హస్తన వైపే. అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ నేపథ్యంలో ఢిల్లీలో వాతావరణం వేడెక్కింది. సర్వేలన్నీ ఆప్ వైపు మొగ్గు చూపిస్తున్నప్పటికీ..కమల దళం మాత్రం ఆశలు వదులుకోవడంలేదు. అయితే..ఆప్ నేతలు మాత్రం ఢిల్లీలోని 50 సీట్లను ఊడ్చేస్తామంటున్నారు. గతంలో 49 రోజుల పాలన కంటే మెరుగైన పాలన అందిస్తానని ఆప్ అధినేత కేజ్రీవాల్ ఓటర్ల ముందుకు వెళ్లారు.
అవినీతి నిర్మూలన, కరెంట్ చార్జీలు తగ్గిస్తామని చెప్పడం...మంచినీళ్లు సరఫరా ఆప్‌కు ఓట్లు కురిపించాయని విశ్లేషకులు అంటున్నారు. ఎగ్జిట్ పోల్ అనంతరం ఆప్‌లో ఉత్సాహం ఉరకలెత్తుతుంటే..కమలనాధులు డీలా పడ్డారు. కాసేపటి క్రితమే కేజ్రీవాల్ ఆప్ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడి ఫలితాలు వీక్షించడానికి ఎల్‌ఈడీ స్క్రీన్‌లు ఏర్పాటు చేశారు. ఆప్ 27 స్థానాల్లో ముందంజలో ఉంటే, బీజేపీ 13, కాంగ్రెస్ 5, ఇతరులు ఒక స్థానంలో లీడ్ లో ఉన్నారు.