కొకైన్ స్మగ్లింగ్ వెనుక దావూద్! | Dawood running international drugs racket via Nepal? | Sakshi
Sakshi News home page

కొకైన్ స్మగ్లింగ్ వెనుక దావూద్!

May 27 2016 10:53 AM | Updated on May 25 2018 2:29 PM

కొకైన్ స్మగ్లింగ్ వెనుక దావూద్! - Sakshi

కొకైన్ స్మగ్లింగ్ వెనుక దావూద్!

తమ దేశం మీదుగా మాఫియా ముఠా నాయకుడు అంతర్జాతీయ మార్కెట్‌కి కొకైన్‌ను స్మగ్లింగ్ చేస్తున్నట్టు నేపాల్ పోలీసులు అనుమానిస్తున్నారు.

దర్యాప్తు జరుపుతున్న నేపాల్ పోలీసులు
కఠ్మాండు:
తమ దేశం మీదుగా మాఫియా ముఠా నాయకుడు అంతర్జాతీయ మార్కెట్‌కి కొకైన్‌ను స్మగ్లింగ్ చేస్తున్నట్టు నేపాల్ పోలీసులు అనుమానిస్తున్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల మార్కెటింగ్‌కు సంబంధించి దావూద్‌కు సన్నిహితులుగా అనుమానిస్తున్న ముగ్గురు పాక్ జాతీయులను ఇటీవల అరెస్టు చేసిన నేపథ్యంలో పోలీసులు ఈ కోణంలో యోచిస్తున్నారు. నకిలీ కరెన్సీలో ప్రమేయం, హెరాయిన్ స్మగ్లింగ్‌తోపాటు యూరప్‌కు ఆసియామీదుగా కొకైన్ స్మగ్లింగ్‌లో పాక్ జాతీయుల ప్రమేయంపై నేపాల్ పోలీసులు ఓ నిర్ధారణకొచ్చారు. 

ఇద్దరు స్థానికుల వద్ద నేపాల్ నార్కోటిక్ బ్యూరో (ఎన్సీబీ).. రెండు కిలోలకుపైగా కొకైన్‌ను స్వాధీనం చేసుకుంది. దీని విలువ మార్కెట్‌లో దాదాపు 492 డాలర్లు ఉంటుంది. ఇందులో కొంతమంది ప్రభావవంతమైన డ్రగ్ లార్డుల ప్రమేయం ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఈ విషయమై ఎన్సీబీ చీఫ్, డీఐజీ జై బహదుర్ మీడియాతో మాట్లాడుతూ మెరిస్ కార్మెన్ నర్వేజ్ (వెనిజులా), మహ్మద్ లామైన్ డబో (నైజీరియా), తౌహిద్ ఖాన్ (భారత్), దిల్ బహదుర్ గురుంగ్ (నేపాల్)లను అరెస్టు చేసి, వారి వద్దనుంచి కొకైన్ స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. పాకిస్తాన్ జాతీయుల సహాయంతో వీరు హాంగ్‌కాంగ్‌కు చెందిన వ్యక్తులతో సంబంధాలు ఏర్పాటు చేసుకున్నారని, సదరు పాక్ జాతీయులను వాహిద్ ఖాన్, అబ్దుల్ రజాక్, దావూద్‌తో అత్యంత సన్నిహిత సంబంధాలు కలిగిన అతని సోదరుడిగా గుర్తించామని చెప్పారు. భారతీయ గూఢచార విభాగం ఇచ్చిన సమాచారం మేరకు ఈ రాకెట్‌లో ప్రమేయమున్నట్టుగా అనుమానిస్తున్న పాక్ జాతీయులను అరెస్టు చేశామని డీఐజీ చాంద్ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement