ప్రేయసిని చంపి.. డాన్స్ టీచర్ ఆత్మహత్య | dance teacher strangulates lover, hangs self | Sakshi
Sakshi News home page

ప్రేయసిని చంపి.. డాన్స్ టీచర్ ఆత్మహత్య

Jun 30 2016 9:54 AM | Updated on Sep 4 2017 3:49 AM

ప్రేయసిని చంపి.. డాన్స్ టీచర్ ఆత్మహత్య

ప్రేయసిని చంపి.. డాన్స్ టీచర్ ఆత్మహత్య

దక్షిణ ఢిల్లీలోని మెహరౌలి ప్రాంతంలో దారుణం చోటుచేసుకుంది. డాన్స్ టీచర్గా పనిచేసే ఓ యువకుడు తన ప్రేయసి పీకకు కరెంటు వైరు చుట్టి చంపేసి, తర్వాత సీలింగ్ ఫ్యానుకు ఉరేసుకుని ఆత‍్మహత్య చేసుకున్నాడు.

దక్షిణ ఢిల్లీలోని మెహరౌలి ప్రాంతంలో దారుణం చోటుచేసుకుంది. డాన్స్ టీచర్గా పనిచేసే ఓ యువకుడు తన ప్రేయసి పీకకు కరెంటు వైరు చుట్టి చంపేసి, తర్వాత సీలింగ్ ఫ్యానుకు ఉరేసుకుని ఆత‍్మహత్య చేసుకున్నాడు. ఇండోర్కు చెందిన సోను ఢిల్లీలో డాన్స్ స్కూలు నడుపుతుంటాడు. అక్కడ డాన్స్ నేర్చుకోడానికి వచ్చిన యోగితతో అతడు ప్రేమలో పడ్డాడు. తర్వాత కొన్నాళ్లకు ఆమె వేరే మగాళ్లతో మాట్లాడుతుంటే వద్దని చెప్పాడు. దాంతో ఇద్దరికీ గొడవ అయ్యింది. ఆమెకు వేరేవాళ్లతో సంబంధం ఉందని సోను అనుమానించినట్లు ఇద్దరి స్నేహితుల ప్రకటనల ఆధారంగా పోలీసులు తెలిపారు.

అతడు రెండు రోజుల ముందుగానే హత్య - ఆత్మహత్యలకు ప్లాన్ వేశాడు. ముందుగా ఓ కరెంటు వైరు తీసుకొచ్చి, క్లాసు సమయం కూడా మార్చాడు. రెండు రోజుల క్రితం తన వాట్సప్ స్టేటస్ను కూడా ‘నేను మరో తప్పు చేశాను’ అని మార్చాడు. చెప్పడానికి ఎవరూ లేకపోయినా డాన్స్ మాత్రం మానొద్దని విద్యార్థులకు చెప్పాడు. మర్నాటి ఉదయం అకాడమీని శుభ్రం చేయడానికి పనిమనిషి వచ్చినపుడు ఇద్దరి మృతదేహాలు కనిపించాయి. ఆమె పీకకు కరెంటువైరు బిగించి చంపి, ఆమె దుపట్టాతోనే ఉరేసుకున్నాడని, మృతదేహాలను పోస్టుమార్టంకు పంపామని పోలీసులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement