గవర్నర్తో తమిళనాడు సీఎస్ భేటీ | cs rammohan rao met governer vidyasagar rao | Sakshi
Sakshi News home page

గవర్నర్తో తమిళనాడు సీఎస్ భేటీ

Oct 7 2016 4:38 PM | Updated on Aug 14 2018 2:14 PM

తమిళనాడు గవర్నర్ విద్యాసాగర్ రావుతో ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్ రావు భేటీ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో పరిపాలన గురించి గవర్నర్ విద్యాసాగర్ రావుకు ఆయన వివరించారు

చెన్నై: తమిళనాడు గవర్నర్ విద్యాసాగర్ రావుతో ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్ రావు భేటీ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో పరిపాలన గురించి గవర్నర్ విద్యాసాగర్ రావుకు ఆయన వివరించారు. గత పదిహేను రోజులుగా తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలోనే ఉంటున్న ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం విషయంలో ఇప్పటికే తీవ్ర స్థాయిలో ఆందోళనలు బయలుదేరిన సమయంలో సీఎస్ గవర్నర్ ను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఈ సందర్భంగా వారి మధ్య జయ ఆరోగ్య పరిస్థితులపై కూడా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఈ రోజు ఉదయం కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇప్పటికే ముఖ్యమంత్రి జయను ఆస్పత్రిలో పరామర్శించేందుకు వెళ్లొచ్చిన విషయం తెలిసిందే. ఆయనకు వైద్యులు జయ ఆరోగ్య పరిస్థితులు వివరించినట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement