రాహుల్ గాంధీకి సమన్లు | Court asks Rahul Gandhi to be present on May 8 hearing in connection to RSS remark | Sakshi
Sakshi News home page

రాహుల్ గాంధీకి సమన్లు

Mar 30 2015 2:23 PM | Updated on Oct 16 2018 2:49 PM

మహారాష్ట్రలోని భివాండీ కోర్టు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి సోమవారం సమన్లు జారీ చేసింది.

ముంబై:   మహారాష్ట్రలోని  భివాండీ కోర్టు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి సోమవారం సమన్లు  జారీ చేసింది.  ఆర్ఎస్ఎస్ నేత రాజేష్ కుంటే  దాఖలు చేసిన పరువునష్టం  కేసులో రాహుల్ గాంధీ కోర్టుకు  గైర్హాజరు కావడంతో కోర్టు  ఈ ఆదేశాలు  జారీ చేసింది. వ్యక్తిగత కారణాల రీత్యా కోర్టు హాజరు కాలేకపోతున్నారంటూ  రాహుల్  న్యాయవాది పిటిషన్ను  హైకోర్టు తిరస్కరించింది. మే 8 న కోర్టు కు  హాజరుకావాలని  ఆదేశించింది.గత లోకసభ ఎన్నికల ప్రచారంలో  ఆర్ఎస్ఎస్ కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు  చేశారంటూ ముంబై హైకోర్టులో రాహుల్ గాంధీపై డిఫమేషన్  కేసు దాఖలైన సంగతి తెలిసిందే.

 

Advertisement
 
Advertisement
Advertisement