బీసీ కమిషన్‌కు ‘హోదా’పై ఏకాభిప్రాయం | Consensus on bill giving constitutional status to National Commission for Backward Classes reached | Sakshi
Sakshi News home page

బీసీ కమిషన్‌కు ‘హోదా’పై ఏకాభిప్రాయం

Jun 27 2017 6:02 PM | Updated on Sep 5 2017 2:36 PM

ఎన్‌సీబీసీకు రాజ్యాంగ హోదా కల్పించే బిల్లుపై ఏర్పాటైన పార్లమెంటరీ కమిటీ ఏకాభిప్రాయానికి వచ్చింది.

న్యూఢిల్లీ: వెనుకబడిన వర్గాల జాతీయ కమిషన్‌ (ఎన్‌సీబీసీ)కు రాజ్యాంగ హోదా కల్పించే బిల్లుపై ఏర్పాటైన పార్లమెంటరీ కమిటీ ఏకాభిప్రాయానికి వచ్చింది. దీంతో ఈ బిల్లు వచ్చే నెల 17 నుంచి ప్రారంభంకానున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లోనే ఆమోదం పొందే అవకాశం ఉంది.

ఈ బిల్లును ఇప్పటికే లోక్‌సభ ఆమోదించగా రాజ్యసభలో విపక్షాలు వ్యతిరేకించాయి. దీంతో బిల్లుపై ఏకాభిప్రాయ సాధనకు బీజీపీ ఎంపీ భూపేంద్ర యాదవ్‌ నేతృత్వంలో శరద్‌ యాదవ్, రాంగోపాల్‌ యాదవ్, సతీశ్‌ మిశ్రా, ప్రఫుల్‌ పటేల్‌ తదితర 25 మంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేశారు. తాజాగా కమిటీ బిల్లుపై ఏకాభిప్రాయానికి వచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement