వలస కార్మికులు: సోనియా కీలక ‍నిర్ణయం | Congress will pay migrant Workers Train Chargers Says Sonia Gandhi | Sakshi
Sakshi News home page

వలస కార్మికుల ఖర్చులు భరిస్తాం : సోనియా

May 4 2020 10:10 AM | Updated on May 4 2020 10:15 AM

Congress will pay migrant Workers Train Chargers Says Sonia Gandhi - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : లాక్‌డౌన్‌ కారణంగా చిక్కుకుపోయిన వలస కూలీలకు కాంగ్రెస్‌ పార్టీ అండగా నిలిచింది. దేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఉన్న కూలీలకు వారి స్వస్థలాలకు చేరేలా లాక్‌డౌన్‌ ఆంక్షలను కేంద్ర ప్రభుత్వం  సడలించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారు స్వస్థలాలకు వెళ్లేందుకు కనీస ప్రయాణ ఖర్చులు కూడా లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు కూలీల ప్రయాణ ఖర్చులపై కేంద్రం ఎలాంటి క్లారిటీ ఇవ్వక​పోవడంతో ప్రభుత్వ వైఖరిపై ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. ఈ క్రమంలో వలస కూలీల ఇబ్బందులపై స్పందించిన కాంగ్రెస్‌ అధిష్టానం వారికి అండగా ఉంటామని ప్రకటించింది. వలసకార్మికుల ప్రయాణ ఖర్చు కాంగ్రెస్ పార్టీనే భరిస్తుందని, స్థానిక పార్టీ నేతలు వలస కార్మికులకు భరోసా నివ్వాలని పార్టీ అధినేత్రి సోనియా గాంధీ పిలుపునిచ్చారు. (ఇడిసిపెడితే నేను పోత సారు..)

రైళ్ల ఖర్చులు కూడా పార్టీ భరిస్తుందని సోనియా తెలిపారు. ఈ మేరకు కార్మికుల కష్టాలపై కేంద్రానికి సోమవారం ఆమె లేఖ రాశారు. స్థానిక పీసీసీ నేతలు వలస కార్మికుల అండగా నిలవాలని సోనియా పిలుపునిచ్చారు. వలస కార్మికులే దేశానికి వెన్నెముకగా అభివర్ణించిన సోనియా వారి కష్టం, త్యాగం మన దేశానికి పునాది అని వర్ణించారు. విదేశాల్లో ఉన్న వారిని ప్రత్యేక విమానాల్లో దేశానికి తీసుకొచ్చిన ప్రభుత్వం.. ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వల సకార్మికుల్ని సొంతూళ్లకు పంపాలేదా అంటూ ఘాటుగా ప్రశ్నించారు. వలస కూలీలు ఇళ్లకు వెళ్లకుండా చిక్కుకుపోవడానికి ప్రభుత్వమే కారణమని ఘాటు విమర్శలు చేశారు. కేవలం 4 గంటల సమయం ఇచ్చి లాక్‌డౌన్ విధించారని మండిపడ్డారు. (అర్నాబ్‌ గోస్వామిపై కేసు నమోదు)


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement