ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ ఎన్నికల ప్రచార బాధ్యతలను ప్రియాంక గాంధీకి అప్పగించాలన్న డిమాండ్ల నేపథ్యంలో.. పార్టీ సీఎం అభ్యర్థిని ఎన్నికలకు ముందే ప్రకటిస్తామని కాంగ్రెస్ సంకేతాలిచ్చింది.
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ ఎన్నికల ప్రచార బాధ్యతలను ప్రియాంక గాంధీకి అప్పగించాలన్న డిమాండ్ల నేపథ్యంలో.. పార్టీ సీఎం అభ్యర్థిని ఎన్నికలకు ముందే ప్రకటిస్తామని కాంగ్రెస్ సంకేతాలిచ్చింది. 'ఎన్నికలకు ముందు మా వ్యూహాన్ని, అభ్యర్థిని ప్రకటిస్తాం' అని పార్టీ ప్రధాన కార్యదర్శి గులాం నబీ ఆజాద్ ఢిల్లీలో చెప్పారు.
వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాలు ఇంచార్జిగా ఆజాద్ ను హైకమాండ్ నియమించింది. ముఖ్యమంత్రి అభ్యర్థిని ముందుగానే ప్రకటించి కొత్త సంప్రదాయాన్ని నెలకొల్పాలని కాంగ్రెస్ భావిస్తోంది.