కూలిపోయిన సుఖోయ్‌ – 30 | Collapsed Sukhoy - 30 | Sakshi
Sakshi News home page

కూలిపోయిన సుఖోయ్‌ – 30

May 27 2017 1:52 AM | Updated on Sep 5 2017 12:03 PM

గల్లంతైన భారత వైమానిక దళానికి చెందిన సుఖోయ్‌–30 యుద్ధవిమానం శకలాలను శుక్రవారం అరుణాచల్‌ప్రదేశ్‌లోని సోనిత్‌పూర్‌ జిల్లాలో దండకారణ్యంలో గుర్తించారు.

తేజ్‌పూర్‌: గల్లంతైన భారత వైమానిక దళానికి చెందిన సుఖోయ్‌–30 యుద్ధవిమానం శకలాలను శుక్రవారం అరుణాచల్‌ప్రదేశ్‌లోని సోనిత్‌పూర్‌ జిల్లాలో దండకారణ్యంలో గుర్తించారు.

అడ్వాన్స్‌డ్‌ లైట్‌ హెలికాప్టర్‌ తో గాలింపు జరుపుతున్న సిబ్బంది విమాన శకలాలను గుర్తించారు. కానీ తీవ్ర ప్రతికూల వాతావరణం వల్ల  ఘటనాస్థలికి చేరుకోలేకపోతున్నారు. విమానంలోని సిబ్బంది మరణించినట్లు భావిస్తున్నారు. అస్సాంలోని తేజ్‌పూర్‌ సలోన్‌బారి నుంచి మంగళవారం ఉదయం ఈ విమానం బయల్దేరింది. తేజ్‌పూర్‌కు వాయవ్యంగా 60 కి.మీ. దూరంలో విమానం నుంచి చివరిసారి సంకేతాలు వచ్చాయి.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement