ఇంటర్నెట్‌ సెలబ్రిటిగా సీఎం పెంపుడు కుక్క

UP CM Yogi Adityanath Pet Dog Kalu Become Internet Celebrity - Sakshi

లక్నో: కొన్ని పెంపుడు జంతువులు వాటి ఆలవాట్ల వల్లనో.. అవి చేసే పనులతోనో వార్తల్లో నిలుస్తుంటాయి. ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి అదిత్యనాథ్‌ పెంపుడు కుక్క మాత్రం ఏమి చేయకుండానే సెలబ్రిటీ అయిపోయింది. ఈ బ్లాక్‌ లాబ్రాడర్‌ కుక్క పేరు ‘కాలూ’. సీఎం యోగి అదిత్యనాథ్‌ ‘కాలూ’తో సరదాగా ఆడుకుంటున్న ఫోటోలు ప్రస్తుతం నెట్టింట హల్‌చల్‌ చేస్తున్నాయి. యోగికి ఈ కుక్కను గోరఖ్‌పూర్‌ ఆలయ భక్తులు బహుమతిగా ఇచ్చారు. అప్పటి నుంచి కలుపై సీఎం ప్రత్యేక దృష్టిపెట్టి పెంపకంలో జాగ్రత్తలు పాటిస్తున్నారు. ప్రస్తుతం ‘కాలూ’ గోరఖ్‌పూర్‌ ఆలయంలో ఉంది.

అయితే సీఎం యోగి ఈ ఆలయానికి వచ్చినపుడల్లా దానిని కలుస్తూ ఉంటాడని, సమయం దొరికినప్పుడల్లా ప్రత్యేకంచి దాని కోసమే గొరఖ్‌పూర్‌ వెళ్తుంటాడని ఆలయ ఇన్‌చార్జీ తివారి మీడియాకు తెలిపారు. అయితే కలుకు కూడా యోగి  అంటే చాలా ఇష్టమని, ఆయనను చూడగానే ఆనందంతో యోగిపైకి ఎగురుతూ ఉంటుందని చెప్పారు. ఈ క్రమంలో సోమవారం సీఎం యోగి అదిత్యనాథ్‌ గోరఖ్‌పూర్‌ వెళ్లి ‘కాలూ’ను కలిసి దానికి పన్నీరు తీనిపిస్తున్న ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

అనంతరం దీనిపై తివారి మీడియాతో మాట్లాడుతూ ‘ఈ బ్లాక్‌ లాబ్రాడర్‌ను 2016 డిసెంబర్‌లో గోరఖ్‌పూర్‌ ఆలయానికి తీసుకువచ్చాం. అదే సమయంలో సీఎం యోగి పెంపుడు కుక్క రాజాబాబు చనిపోవడంతో ఆయన చాలా బాధపడ్డారు. దీంతో ఆలయ భక్తులు యోగికి ఈ కుక్కను బహుమతిగా ఇచ్చారు. అది వచ్చిన మూడు నెలకు 2017 మార్చిలో యోగి అదిత్యానాథ్‌ సీఎం అయ్యారు. ఇక అప్పటి నుంచి ఆలయ భక్తులు ‘కాలూ’ను సీఎం యోగికి లక్కీ అని అభిప్రాయపడుతుంటారు. అయితే ఈ కుక్క శాఖాహారి అని, గుడిలోని పాలు, రోటి మాత్రమే తింటుందని చెప్పారు. అలాగే ఇది అనారోగ్య బారిన పడకుండ ప్రత్యేకంగా వసతులు కూడా ఏర్పాటు చేశామని తివారి తెలిపారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top