గిన్నీస్‌ బుక్‌ రికార్డు కోసం జల్లికట్టు

CM Palanisamy Starts Jallikattu In Tamilnadu - Sakshi

చెన్నై: గిన్నీస్‌ బుక్‌ రికార్డు కోసం తమిళనాడులో అతిపెద్ద జల్లికట్టును అధికారులు ఏర్పాటు చేశారు. పుదుకొట్టై జిల్లా విరాళీమలైలో సీఎం పళణిస్వామి ఆదివారం జల్లికట్టు పోటీలను ప్రారంభించారు. దీనిలో 2500 ఎద్దులు, 3వేల మంది యువకులు పాల్గొన్నారు. 

జల్లికట్టు ఎద్దు మృతి..
నామక్కల్‌ జరిగిన జల్లికట్టుకు కొల్లిమలైకు చెందిన మణికంఠన్‌ తన ఎద్దు తీసుకెళ్లాడు. ఈ ఎద్దు వాడివాసల్‌ నుంచి వెలుపలికి రాగా, దాని వేగానికి భయపడిన వీరులు పట్టుకోలేకపోయారు. దీంతో ఎద్దు పరుగులు తీస్తూ మైదానానికి వెలుపల ఉన్న  50  బావిలో పడిపోయింది. వెంటనే అక్కడ ఉన్న అగ్నిమాపకసిబ్బంది హుటాహుటిన ఆ ఎద్దును బయటకు తీసి ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలోనే మృతి చెందింది.  
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top