సీబీఎస్ ఈ పాఠశాలల్లోనూ పదో తరగతి బోర్డ్ ఎగ్జామ్‌ను పునఃప్రవేశపెడుతున్నట్లు జవదేకర్ తెలిపారు.
జైపూర్: సీబీఎస్ ఈ పాఠశాలల్లోనూ 2017–18 విద్యా సంవత్సరం నుంచి పదో తరగతి బోర్డ్ ఎగ్జామ్‌ను పునఃప్రవేశపెడుతున్నట్లు కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ సూచనప్రాయంగా తెలిపారు.
ఐదు, ఎనిమిది తరగతులకూ బోర్డ్ ఎగ్జామ్స్ నిర్వహించే అధికారాలను రాష్ట్ర ప్రభుత్వాలకు కట్టబెట్టే ప్రతిపాదనను ముందుగా కేబినెట్ ముందుంచుతామని, ఆమోదం పొందాక పార్లమెంటులో ప్రవేశపెడతామని చెప్పారు. విద్యాప్రమాణాలు దిగజారుతున్నాయన్న ఆందోళనల నేపథ్యంలో ఈ ప్రతిపాదనలు చేసినట్టు వెల్లడించారు.