5, 8వ తరగతి విద్యార్థులకు వార్షిక పరీక్షలు నిర్వహించే అవకాశముందని కేంద్రం సంకేతాలిచ్చింది.
న్యూఢిల్లీ: 5, 8వ తరగతి విద్యార్థులకు వార్షిక పరీక్షలు నిర్వహించే అవకాశముందని కేంద్రం సంకేతాలిచ్చింది. ‘3, 5, 8, 10వ తరగతి విద్యార్థులు నేర్చుకునే నైపుణ్యాల్లో గణనీయ పురోగతి అవసరమని ఎన్‌సీఈఆర్‌టీ నివేదిక పేర్కొంది.
విద్యార్థులు నేర్చుకునే విధానం వారి ఆర్థిక, సామాజిక పరిస్థితులు, తల్లిదండ్రుల విద్యా నేపథ్యం, కనీస వసతులు తదితరాలపై ఆధారపడి ఉంటుంది’ అని హెచార్డీ శాఖ సహాయ మంత్రి ఉపేంద్ర కష్వాహ గురువారం రాజ్యసభలో అన్నారు.