ఎఫ్బీలో అభ్యంతరకర పోస్ట్.. ఐఏఎస్కు నోటీసులు | Chhattisgarh govt slaps notice on IAS officer for Facebook post | Sakshi
Sakshi News home page

ఎఫ్బీలో అభ్యంతరకర పోస్ట్.. ఐఏఎస్కు నోటీసులు

Jul 28 2016 9:20 AM | Updated on Jul 26 2018 1:02 PM

ఎఫ్బీలో అభ్యంతరకర పోస్ట్.. ఐఏఎస్కు నోటీసులు - Sakshi

ఎఫ్బీలో అభ్యంతరకర పోస్ట్.. ఐఏఎస్కు నోటీసులు

ఫేస్బుక్లో వివాదాస్పద పోస్ట్ చేసిన ఐఏఎస్ ఆఫీసర్ అలెక్స్ పాల్ మీనన్కు చత్తీస్గఢ్ ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది.

రాయ్పూర్: ఫేస్బుక్లో వివాదాస్పద పోస్ట్ చేసిన ఐఏఎస్ ఆఫీసర్ అలెక్స్ పాల్ మీనన్కు చత్తీస్గఢ్ ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది.  'మరణశిక్షల్లో ఎక్కువగా ముస్లింలు, దళితులే ఉంటున్నారు.. భారత న్యాయవ్యవస్థలో వివక్షత ఉందా' అంటూ సోషల్ మీడియాలో అలెక్స్ చేసిన పోస్ట్ను జాతీయ మీడియా ప్రముఖంగా ప్రచారం చేసింది. దీంతో ఓ ప్రభుత్వ అధికారి న్యాయవ్యవస్థ నిబద్దతపై సందేహం వ్యక్తం చేయడాన్ని ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది.

చత్తీస్గఢ్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ సెక్రెటరీ నిధి చిబ్బర్ మాట్లాడుతూ.. న్యాయవ్యవస్థకు వ్యతిరేకంగా అలాంటి పోస్టులు సోషల్ మీడియాలో ఉంచడం పరిపాలనా అధికారుల నిబంధనలకు వ్యతిరేకమైంది. దీంతో అతడిపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలంటూ నోటీసులు జారీ చేసినట్లు వెల్లడించారు. అలెక్స్ దీనిపై నెలరోజుల గడువులోపు వివరణ ఇవ్వనున్నారు. 2012లో సుక్మా జిల్లా కలెక్టర్గా విధులు నిర్వహిస్తున్న సమయంలో అలెక్స్ను మావోయిస్టులు కిడ్నాప్ చేయడంతో వార్తల్లో నిలిచాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement