చౌతాలా (82) ఇంటర్‌ పాసయ్యారు! | Chautala (82) Inter passed! | Sakshi
Sakshi News home page

చౌతాలా (82) ఇంటర్‌ పాసయ్యారు!

May 18 2017 3:57 AM | Updated on Sep 5 2017 11:22 AM

చౌతాలా (82) ఇంటర్‌ పాసయ్యారు!

చౌతాలా (82) ఇంటర్‌ పాసయ్యారు!

హరియాణా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాశ్‌ చౌతాలా(82) హయ్యర్‌ సెకండరీ పరీక్షలో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు.

చండీగఢ్‌: హరియాణా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాశ్‌ చౌతాలా(82) హయ్యర్‌ సెకండరీ పరీక్షలో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు. టీచర్ల నియామక కుంభకోణంలో దోషిగా తేలిన చౌతాలా ప్రస్తుతం తీహార్‌ జైలులో పదేళ్ల శిక్షఅనుభవిస్తున్నారు.

తీహార్‌లో ఖైదీల కోసం ఏర్పాటు చేసిన ఓపెన్‌ స్కూలింగ్‌ ద్వారా చౌతాలా హయ్యర్‌ సెకండరీ పూర్తి చేసినట్లు ఆయన కుమారుడు, ఐఎన్‌ఎల్డీ నేత అభయ్‌ సింగ్‌ చౌతాలా చెప్పారు. ప్రస్తుతం మనవడు దుష్యంత్‌ వివాహం కోసం పెరోల్‌పై ఉన్న ఆయన.. ఏప్రిల్‌ 23న జైల్లో నిర్వహించిన పరీక్షకు హాజరైనట్లు అభయ్‌ వెల్లడించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement