వివరాలు సేకరించండి.. రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు

Cabinet Secretary Video Conference With CS And DGPs Amid Corona Virus - Sakshi

సీఎస్‌, డీజీపీలతో కేబినెట్‌ సెక్రటరీ వీడియో కాన్ఫరెన్స్‌

సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని నిజాముద్దీన్‌లో జరిగిన తబ్లిగీ జమాత్‌ ప్రార్థనల్లో పాల్గొని తిరిగొచ్చిన వారిలో చాలా మందికి కరోనా వైరస్‌ సోకడంతో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కారదర్శులు, డీజీపీలతో కేంద్ర కేబినెట్‌ సెక్రటరీ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా తబ్లిగి జమాత్‌ కార్యక్రమానికి హాజరైన వారి వివరాలన్నింటినీ సేకరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విదేశీయుల వివరాలు సేకరించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. వీసా నిబంధనలు ఉల్లంఘించి మత కార్యక్రమాల్లో పాల్గొనడాన్ని తీవ్రంగా పరిగణించాలన్నారు.(మర్కజ్‌ @1,030)

ఇక కరోనా వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా సామాజిక దూరాన్ని పాటిస్తూనే.. రవాణా వాహనాలను ఎటువంటి ఆటంకాలు లేకుండా రాష్ట్రాల మధ్య, రాష్ట్రాల్లో లోపల కూడ అనుమతించాలని ఆదేశించారు. నిత్యావసర వస్తువుల సరఫరాకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా చూడాలని పేర్కొన్నారు. వచ్చే వారంలో ప్రధాన మంత్రి గరీబ్‌ కళ్యాణ్‌ యోజనను దశల వారీగా అమలు చేయాలని సూచించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top