పుణేలో పోలీస్ స్టేషన్‌ముందే పేలుడు | bomb blast done infront of police station | Sakshi
Sakshi News home page

పుణేలో పోలీస్ స్టేషన్‌ముందే పేలుడు

Jul 11 2014 1:37 AM | Updated on Aug 21 2018 9:20 PM

పుణేలోని ఒక పోలీస్ స్టేషన్ ముందు గురువారం జరిగిన పేలుడులో ఒక పోలీస్ కానిస్టేబుల్ సహా ముగ్గురు గాయపడ్డారు.

 పుణే: పుణేలోని ఒక పోలీస్ స్టేషన్ ముందు గురువారం జరిగిన పేలుడులో ఒక పోలీస్ కానిస్టేబుల్ సహా ముగ్గురు గాయపడ్డారు. ఫరస్కానా పోలీస్ స్టేషన్‌వద్ద వాహనాలు నిలిపే స్థలంలోని ఒక మోటార్ సైకిల్‌పై ఉంచిన తక్కువ శక్తిగల పేలుడు పదార్థం పేలడంతో ముగ్గురు స్వల్పంగా గాయపడ్డారని అధికారులు తెలిపారు. ఉగ్రవాద వ్యతిరేక దళం (ఏటీఎస్) అధికారులతో కలసి ఆయన సంఘటనా స్థలాన్ని సందర్శించారు.

సంఘటనా స్థలంనుంచి బాల్ బేరింగ్‌లను, మేకులను స్వాధీనం చేసుకుని, ఫోరెన్సిక్ పరీక్షకు పంపించామని, ఉగ్రవాద కోణంతోపాటు అన్ని అంశాలపై దర్యాప్తు చేస్తున్నామని సతీశ్ మాథుర్ చెప్పారు. పేలుడు పరికరం అమర్చిఉన్న మోటార్ సైకిల్ ఒక పోలీసుదని, కొన్నాళ్ల కిందట అది అపహరణకు గురైందని చెప్పారు. కాగా, పేలుడు వెనుక ఉగ్రవాద హస్తం లేకపోవచ్చని కేంద్ర ప్రభుత్వం అభిప్రాయపడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement