ఆకాష్‌పై వేటుకు కాషాయదళం సన్నాహాలు

BJP May Issue Showcause Notice To Akash Vijayvargiya - Sakshi

భోపాల్‌ : మున్సిపల్‌ అధికారిపై క్రికెట్‌ బ్యాట్‌తో దాడిచేసిన పార్టీ ఇండోర్‌ ఎమ్మెల్యే, సీనియర​ నేత కైలాష్‌ విజయవర్గీయ కుమారుడు ఆకాష్‌ విజయవర్గీయకు బీజేపీ షోకాజ్‌ నోటీసు జారీ చేయవచ్చని ఆ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. గత వారం జరిగిన ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ సీరియస్‌ కావడంతో ఎమ్మెల్యేపై చర్యలు తప్పవని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. ఎవరి కొడుకైనా ఇలాంటి తప్పుడు పనులకు పాల్పడితే ఉపేక్షించేదిలేదని ఆకాష్‌ చర్యపై ప్రధాని తీవ్రస్ధాయిలో మండిపడిన సంగతి తెలిసిందే.

దూకుడుగా వ్యవహరించిన ఆకాష్‌పై చర్యలకు సంబంధించి మధ్యప్రదేశ్‌ పార్టీ చీఫ్‌ రాకేష్‌ సింగ్‌తో ఢిల్లీ నుంచి ఓ పార్టీ సీనియర్‌ నేత ఫోన్‌లో మాట్లాడినట్టు తెలిసింది. ఈ అంశంపై కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, సీనియర్‌ బీజేపీ నేత రామ్‌లాల్‌ సైతం రాకేష్‌ సింగ్‌తో సంప్రదింపులు జరిపినట్టు సమాచారం. ఆకాష్‌ ప్రవర్తనపై సీరియస్‌గా ఉన్న బీజేపీ అధిష్టానం ఆయనపై తీవ్ర చర్యలు తీసుకుంటుందని మీడియాలో సైతం ప్రచారం ఊపందుకుంది. ఆకాష్‌ను పార్టీ నుంచి సస్పెండ్‌ చేయవచ్చని భావిస్తున్నారు. కాగా ప్రభుత్వ అధికారిపై దురుసుగా ప్రవర్తించిన ఆకాష్‌ను ఇండోర్‌ పోలీసులు అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top