భార్యాపిల్లలను చంపి బీజేపీ నేత ఆత్మహత్య | BJP leader shot wife, children, pets dead, commits suicide in MP | Sakshi
Sakshi News home page

భార్యాపిల్లలను చంపి బీజేపీ నేత ఆత్మహత్య

Feb 15 2016 10:21 AM | Updated on Mar 29 2019 9:07 PM

భార్యాపిల్లలను చంపి బీజేపీ నేత ఆత్మహత్య - Sakshi

భార్యాపిల్లలను చంపి బీజేపీ నేత ఆత్మహత్య

మధ్యప్రదేశ్ లో బీజేపీ నేత ఒకరు భార్యాపిల్లలను హత్య చేసి ఆత్మహత్య చేసుకున్నాడు.

భోపాల్: మధ్యప్రదేశ్ లో బీజేపీ నేత ఒకరు భార్యాపిల్లలను హత్య చేసి ఆత్మహత్య చేసుకున్నాడు. కట్ని జిల్లాలోని బొహ్రిబంద్ ప్రాంతంలో శనివారం ఉదయం ఈ దారుణం చోటుచేసుకుంది. పెట్రోల్ పంపు నిర్వహిస్తున్న శశాంక్ తివారి(38) ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఇంట్లో రక్తపు మడుగులో పడివున్న శశాంక్ కుటుంబ సభ్యులను చూసి పోలీసులకు పనిమనిషి సమాచారం అందించడంతో ఈ ఘటన వెలుగుచూసింది.

శశాంక్ భార్య మిని తివారి(30), కుమార్తె మాని(12), కొడుకు అభి(8) మృతదేహాలపై బుల్లెట్టు గాయాలున్నట్టు పోలీసులు గుర్తించారు. రెండు పెంపుడు కుక్కలు కూడా చనిపోయి ఉండడాన్ని పోలీసులు కనుగొన్నారు. కుంగుబాటు, ఆర్థిక సమస్యలతో శశాంక్ తివారి ఈ కిరాతకానికి పాల్పడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. అతడి పెట్రోల్ బంకును స్థానిక అధికారులు ఇటీవల మూసివేయడంతో ఆర్థిక సమస్యల్లో చిక్కున్నట్టు వెల్లడించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement