ఆయుధ సవరణ బిల్లుకు పార్లమెంట్‌ ఓకే

Bill for Stricter Arms Act Passed by  Rajya Sabha - Sakshi

న్యూఢిల్లీ: ఆయుధ సవరణ బిల్లు-2019కు మంగళవారం రాజ్యసభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లును సోమవారం లోక్‌సభ ఆమోదించింది. ఒక వ్యక్తి ఇప్పటివరకు అత్యధికంగా మూడు తుపాకులు, లేదా సంబంధిత ఆయుధాలను కలిగి ఉండే అవకాశం ఉండగా, ఇకపై అత్యధికంగా రెండు మాత్రమే కలిగి ఉండే ప్రతిపాదనను బిల్లులో చేర్చారు. వారసత్వంగా వచ్చిన ప్రాచీన ఆయుధాలను నిరుపయోగం చేసి, ఎన్నైనా భద్రపరుచుకోవచ్చని హోంశాఖ సహాయమంత్రి జి. కిషన్‌ రెడ్డి రాజ్యసభకు తెలిపారు. నిర్లక్ష్యంగా, మనుషులకు ప్రాణహాని కలిగేలా ఆయుధాన్ని ఉపయోగిస్తే రెండేళ్ల జైలు, లక్ష జరిమానా ప్రతిపాదన బిల్లులో ఉంది. అక్రమంగా ఆయుధాలు తయారు చేసినా, కలిగివున్నా గరిష్టంగా జీవితఖైదు విధించాలని బిల్లులో ప్రతిపాదించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top