బిలాస్‌పూర్‌ @ 49.3 డిగ్రీలు | Bilaspur @ 49.3 degrees | Sakshi
Sakshi News home page

బిలాస్‌పూర్‌ @ 49.3 డిగ్రీలు

May 24 2017 2:00 AM | Updated on Sep 5 2017 11:49 AM

బిలాస్‌పూర్‌  @ 49.3 డిగ్రీలు

బిలాస్‌పూర్‌ @ 49.3 డిగ్రీలు

ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌లో సోమవారం రికార్డు స్థాయిలో 49.3 డిగ్రీ సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదవ్వడంతో పరికరాలలో లోపాలు ఏమైనా ఉన్నాయేమోనని నిపుణులు పరిశీలించారు.

రాయ్‌పూర్‌: ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌లో సోమవారం రికార్డు స్థాయిలో 49.3 డిగ్రీ సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదవ్వడంతో పరికరాలలో లోపాలు ఏమైనా ఉన్నాయేమోనని నిపుణులు పరిశీలించారు. ఛత్తీస్‌గఢ్‌లో ఇప్పటివరకు ఎన్నడూ ఇంత ఉష్ణోగ్రత నమోదు కాలేదు. దీంతో ఉష్ణోగ్రతలను కొలిచే పరికరాలతోపాటు వేడి పెరగడానికి కారణమైన ఇతర అంశాలను కూడా నిపుణులు పరిశీలించారు.

అయితే పరికరాలలో తప్పులేవీ లేవనీ, సోమవారం నిజంగానే అంత ఉష్ణోగ్రత నమోదైందని ఓ అధికారి తెలిపారు. నిపుణుల బృందం బుధవారం మరోసారి ఈ విషయంలో సమగ్ర దర్యాప్తు జరపనుంది. బిలాస్‌పూర్‌లో మంగళవారం 47.4 డిగ్రీ సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైంది. నైరుతి నుంచి వస్తున్న వేడి గాలుల వల్లే ఉష్ణోగ్రతలు పెరిగి ఉండొచ్చని పలువురు పేర్కొంటున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement