‘భారత్‌లో ముస్లింలు సంతోషంగా ఉన్నారు’

Bhagwat Says India Was Conceptually A Hindu Nation - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో హిందూ సంస్కృతి ఫలితంగానే ఇతర దేశాలతో పోలిస్తే ముస్లింలు భారత్‌లో అత్యంత సంతోషంగా ఉన్నారని ఆరెస్సెస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ అన్నారు. ఒడిషాలో ఆరెస్సెస్‌ కార్యక్రమంలో పాల్గొంటున్న మోహన్‌ భగవత్‌ హిందూ అనేది ఓ మతం లేదా భాష కాదని, ఓ దేశం పేరూ కాదని చెప్పుకొచ్చారు. భారత్‌లో నివసించే వారందరి సంస్కృతి హిందూ అని వ్యాఖ్యానించారు. భిన్న సంస్కృతులను హిందూ విధానం ఆమోదించి గౌరవిస్తుందని చెప్పారు. యూదులు సంచరిస్తున్నప్పుడు  వారికి ఆశ్రయం కల్పించిన ఏకైక దేశంగా భారత్‌ ఆవిర్భవించిందని ఆయన అన్నారు. పార్శీలు కేవలం భారత్‌లోనే స్వేచ్ఛగా తమ మతాన్ని అనుసరిస్తారని ఇదంతా హిందూ మతం గొప్పతనమేనని పేర్కొన్నారు. ఆరెస్సెస్‌ ముద్ర అంతరించి సమాజమంతా ఒకే వర్గంగా మెలగాలన్నది తన ఆక్షాంక్షని స్పష్టం చేశారు. భిన​. సంస్కృతులు, భాషలు, ప్రాంతాలకు అతీతంగా ఒక్కటిగా మెలిగినప్పుడు ముస్లింలు, పార్శీలు ఇతరులు దేశంలో సురక్షితంగా ఉన్నామనే భావనతో ఉంటారని చెప్పారు. మెరుగైన సమాజం ఆవిష్కరణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని ఆయన పిలుపు ఇచ్చారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top