బంగ్లాలో తొక్కిసలాట.. 25 మంది మృతి | bangla 25peoples death | Sakshi
Sakshi News home page

బంగ్లాలో తొక్కిసలాట.. 25 మంది మృతి

Jul 11 2015 4:10 AM | Updated on Sep 3 2017 5:15 AM

బంగ్లాలో తొక్కిసలాట.. 25 మంది మృతి

బంగ్లాలో తొక్కిసలాట.. 25 మంది మృతి

బంగ్లాదేశ్‌లోని మైమన్‌సింగ్ నగరంలో శుక్రవారం ఘోర దుర్ఘటన చోటుచేసుకుంది. రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని షమీమ్ తాలూక్‌దార్ అనే పారిశ్రామికవేత్త తన ఇంటి వద్ద చేపట్టిన ఉచిత దుస్తుల పంపిణీ భారీ తొక్కిసలాటకు దారితీసింది.

ఢాకా: బంగ్లాదేశ్‌లోని మైమన్‌సింగ్ నగరంలో శుక్రవారం ఘోర దుర్ఘటన చోటుచేసుకుంది. రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని షమీమ్ తాలూక్‌దార్ అనే పారిశ్రామికవేత్త తన ఇంటి వద్ద చేపట్టిన ఉచిత దుస్తుల పంపిణీ భారీ తొక్కిసలాటకు దారితీసింది. 25 మంది మృతి చెందగా, 50 మంది గాయపడ్డారు. మృతుల్లో 23 మంది మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు.

దుస్తులను అందుకునేందుకు ఒకేసారి 1,500 మంది షమీమ్ ఇంటి వద్దకు చేరుకోవడంతో తొక్కిసలాట జరిగిందని పోలీసులు చెప్పారు. షమీ మ్ సహా ఎనిమిది మందిని అరెస్టు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement