పెళ్లి వేడుకలో మహిళకు చేదు అనుభవం

In Bangalore Chain Snatching Take Place At Marrige Function Hall - Sakshi

బెంగళూరు : వివాహ వేడుకకు హాజరైన ఓ మహిళకు చేదు అనుభవం ఎదురయ్యింది. కళ్యాణ మంటపం దగ్గర నిల్చున్న మహిళ మెడలోంచి గొలుసు లాక్కెళ్లాడు ఓ దుండగుడు. మహిళ వెనకే నిల్చున్న ఆ వ్యక్తి అదును చూసి మహిళ మెడలోంచి గొలుసు లాక్కెళ్లాడు. ప్రతిఘటించడానికి ప్రయత్నించిన మహిళను పక్కకు తోసి బయటకు పారిపోయాడు. ఈ అనూహ్య సంఘటనతో షాక్‌కు గురయిన మహిళ తేరుకుని దొంగను పట్టుకునేందుకు ప్రయత్నించింది. కానీ ఈ లోపే నిందుతుడు అక్కడ నుంచి పారిపోయాడు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top