‘ఆయన రెండో జకీర్‌ నాయక్‌’

Babul Supriyo Says Asaduddin Owaisi Becoming The Second Zakir Naik  - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఏఐఎంఐఎం చీఫ్‌ అసదుద్దీన్‌ ఓవైసీ రెండో జకీర్‌ నాయక్‌ (ఇస్లాం బోధకుడు)లా తయారవుతున్నారని కేంద్ర మంత్రి బాబుల్‌ సుప్రియో ఆరోపించారు. జకీర్‌ నాయక్‌పై రెచ్చగొట్టే వ్యాఖ్యలతో విద్వేషాన్ని వ్యాపింపచేయడం, ఉగ్ర కార్యకలాపాలకు నిధులు సమకూర్చడం వంటి పలు ఆరోపణలున్న విషయం తెలిసిందే. అయోధ్య వివాదంపై సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో తనకు తమ మసీదును తిరిగి ఇవ్వాలని ఓవైసీ పేర్కొన్న నేపథ్యంలో కేంద్ర మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయన అతిగా మాట్లాడితే చట్టం తన పని తాను చేసుకువెళుతుందని అన్నారు. కాగా, తమ పోరాటం భూమి కోసం కాదని, తమ న్యాయపరమైన హక్కులు దక్కడం కోసమేనని ఓవైసీ వ్యాఖ్యానించారు. మసీదును నిర్మించేందుకు ఏ ఆలయాన్ని కూల్చలేదని సుప్రీం కోర్టు స్పష్టంగా చెప్పిందని..మసీదును మాకు తిరిగివ్వాలని తాము కోరుకుంటున్నామని ఓ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అసదుద్దీన్‌ పేర్కొన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top