మేడమ్‌ టుస్సాడ్స్‌లో రామ్‌దేవ్‌ విగ్రహం

Baba Ramdev's wax statue in Madame Tussauds - Sakshi

న్యూఢిల్లీ: ప్రముఖ యోగా గురు బాబా రామ్‌దేవ్‌ విగ్రహం త్వరలో మేడమ్‌ టుస్సాడ్స్‌లో ఏర్పాటు కానుంది. పతంజలి ఆయుర్వేద్‌ లిమిటెడ్‌ కంపెనీ సహ వ్యవస్థాపకుడైన రామ్‌దేవ్‌ నుంచి నిపుణులైన కళాకారులు 200 కు పైగా నిర్దిష్ట కొలతలు తీసుకోవడంతోపాటు పలు ఫొటోలను తీసుకున్నారు. ‘వృక్షాసన’ యోగా భంగిమలో రామ్‌దేవ్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు.

విగ్రహానికి తన కాషాయ వస్త్రం, ఓ జత చెప్పులను రామ్‌దేవ్‌ అందజేయనున్నారు. మేడమ్‌ టుస్సాడ్స్‌లో ఉన్న ఇతర ప్రముఖుల విగ్రహాలతోపాటు రామ్‌దేవ్‌ ప్రతిమను ఉంచనున్నారు. వీక్షకులు సెల్ఫీలు తీసుకునేందుకు, వారు కూడా వృక్షాసన భంగిమలో యోగా చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. బాబా రామ్‌దేవ్‌ విగ్రహాన్ని లండన్‌లో కూడా ప్రదర్శనకు ఉంచనున్నారని పతంజలి సంస్థ అధికార ప్రతినిధి ఎస్‌కే తిజరవాలా తెలిపారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top