బీజేపీ కార్యదర్శిపై మసీదులో దాడి | Attack on Kerala BJP secretary in Masjid | Sakshi
Sakshi News home page

కేరళ బీజేపీ కార్యదర్శిపై మసీదులో దాడి

Jan 14 2020 2:31 AM | Updated on Jan 14 2020 7:36 AM

Attack on Kerala BJP secretary in Masjid - Sakshi

కట్టప్పన: కేరళ రాష్ట్ర బీజేపీ కార్యదర్శి ఏకే నజీర్‌పై ఇడుక్కి జిల్లా నేడుంగడం మసీదులో దాడి జరిగింది. సీఏఏపై అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఆయన తూక్కుపాలెం మసీదుకు వెళ్లారు. నమాజు చేస్తున్న ఆయన్ను అక్కడ కొందరు వ్యక్తులు వెనుక నుంచి కుర్చీతో కొట్టారని, కాళ్లతో తన్నారని బీజేపీ తెలిపింది.

గాయపడిన నజీర్‌ను చికిత్స కోసం ముందుగా స్థానిక ఆస్పత్రికి, అక్కడి నుంచి కోచిలోని అమృత ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌కు తరలించామని వివరించింది. ఈ దాడికి సోషల్‌ డెమోక్రటిక్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా (ఎస్‌డీపీఐ), సీపీఎం అనుబంధ డెమోక్రటిక్‌ యూత్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా(డీవైఎఫ్‌ఐ) కార్యకర్తలే కారణమని బీజేపీ ఆరోపించింది.   కాగా, మసీదులో నజీర్‌పై జరిగిన దాడికి కారకులెవరో తెలియడం లేదని డీఎస్‌పీ రాజమోహన్‌ తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement