గ్యాంగ్ అరెస్ట్.. కోట్ల పాతనోట్లు స్వాధీనం | ATS seized crores of old currency notes in Jaipur Surajpole | Sakshi
Sakshi News home page

గ్యాంగ్ అరెస్ట్.. కోట్ల పాతనోట్లు స్వాధీనం

Jul 9 2017 1:32 PM | Updated on Sep 22 2018 7:53 PM

గ్యాంగ్ అరెస్ట్.. కోట్ల పాతనోట్లు స్వాధీనం - Sakshi

గ్యాంగ్ అరెస్ట్.. కోట్ల పాతనోట్లు స్వాధీనం

పాత నోట్ల మార్పిడి ముఠాను అరెస్ట్ చేసి కోట్ల రూపాయల విలువ చేసే రద్దయిన పెద్దనోట్లను రాజస్థాన్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు

జైపూర్‌: పాత నోట్ల మార్పిడి ముఠాను అరెస్ట్ చేసి కోట్ల రూపాయల విలువ చేసే రద్దయిన పెద్దనోట్లను రాజస్థాన్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శనివారం అర్ధరాత్రి రూ.2.7 కోట్ల విలువ చేసే రద్దయిన పెద్దనోట్లు రూ.1000, రూ.500 లను స్వాధీనం చేసుకున్నట్లు ఆదివారం జైపూర్ పోలీసులు వెల్లడించారు. పోలీసుల కథనం ప్రకారం.. జైపూర్‌లోని సూరజ్‌పాల్‌ ప్రాంతంలో శనివారం అర్ధరాత్రి ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా తడ్చాడుతున్నారు.

వీరిపై అనుమానం వచ్చి గస్తీ పోలీసులు ప్రశ్నించిన అనంతరం నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి రూ. 2.7 కోట్ల విలువైన పాత నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో స్థానిక హోంగార్డు ఉన్నట్లు సమాచారం. పాతనోట్లను ఇచ్చి కమిషన్ ప్రకారం కొత్తనోట్లుగా మార్చేందుకు యత్నిస్తుండగా వీరిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement