అమేథిలో కేజ్రీవాల్ కు చేదు అనుభవం! | Arvind Kejriwal heckled by women protesters in Amethi | Sakshi
Sakshi News home page

అమేథిలో కేజ్రీవాల్ కు చేదు అనుభవం!

Apr 20 2014 5:04 PM | Updated on Aug 14 2018 4:21 PM

అమేథిలో కేజ్రీవాల్ కు చేదు అనుభవం! - Sakshi

అమేథిలో కేజ్రీవాల్ కు చేదు అనుభవం!

కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నియోజకవర్గం అమేథిలో ఆమ్ ఆద్మీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కు చేదు అనుభవం ఎదురైంది.

అమేథి: కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నియోజకవర్గం అమేథిలో ఆమ్ ఆద్మీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కు చేదు అనుభవం ఎదురైంది. అమేథీ నియోజకవర్గంలోని అయోధ్యనగర్ లో రోడ్ షో నిర్వహిస్తున్న కేజ్రీవాల్ కు మహిళల నుండి నిరసన వ్యక్తమైంది. కేజ్రీవాల్ ర్యాలీలో రాహుల్ గాంధీ జిందాబాద్, ఢిల్లీలో వెన్ను చూపిన కేజ్రీవాల్ వెనక్కి వెళ్లిపో అంటూ మహిళలు నినాదాలు చేశారు. 
 
ఆప్ అభ్యర్థి కుమార్ విశ్వాస్ కు మద్దతుగా నిర్వహించిన రోడ్ షోలో కేజ్రీవాల్ కు మహిళలను నల్లజెండాలతో స్వాగతం పలికారు. మే 7న జరిగే లోకసభ ఎన్నికల్లో రాహుల్ గాంధీకి పోటీగా ఆప్ తరపున కుమార్ విశ్వాస్ బరిలో ఉన్న సంగతి తెలిసిందే. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement