కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ శనివారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని ..రాష్ట్రపతి భవన్లో కలిశారు. నేడు పార్లమెంట్ లో అరుణ్ జైట్లీ సాధారణ బడ్జెట్ ప్రవేశపెట్టనున్న విషయం తెలిసిందే.
న్యూఢిల్లీ : కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ శనివారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని ..రాష్ట్రపతి భవన్లో కలిశారు. నేడు పార్లమెంట్ లో అరుణ్ జైట్లీ సాధారణ బడ్జెట్ ప్రవేశపెట్టనున్న విషయం తెలిసిందే. దాంతో బడ్జెట్ వివరాలను రాష్ట్రపతికి వివరించినట్లు సమాచారం. బడ్జెట్ ప్రవేశపెట్టబోయే ముందు ఆర్థిక మంత్రి ...రాష్ట్రపతిని కలవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయన...ప్రణబ్ను కలిశారు. అనంతరం అరుణ్ జైట్లీ పార్లమెంట్కు బయల్దేరారు. ఈరోజు ఉదయం 11 గంటలకు ఆయన లోక్సభలో బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ఎన్డీఏ ప్రవేశపెట్టనున్న పూర్తిస్థాయి తొలి బడ్జెట్ పై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.