బీజేపీకి బిగ్ బూస్ట్ | Apna Dal merges with BJP - Big development ahead of Uttar Pradesh Assembly Elections | Sakshi
Sakshi News home page

బీజేపీకి బిగ్ బూస్ట్

Jul 4 2016 1:43 PM | Updated on Sep 4 2017 4:07 AM

బీజేపీకి బిగ్ బూస్ట్

బీజేపీకి బిగ్ బూస్ట్

వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరిగే ఉత్తరప్రదేశ్లో కీలక రాజకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి.

న్యూఢిల్లీ: వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరిగే ఉత్తరప్రదేశ్లో కీలక రాజకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. యూపీలో అధికారంలోకి రావాలని బీజేపీ సర్వశక్తులు ఒడ్డుతోంది. యూపీలో ముఖ్యంగా ఓబీసీలలో పట్టున్న ఆప్నా దళ్.. బీజేపీలో విలీనంకానున్నట్టు సమాచారం. వారణాశి-మీర్జాపూర్ ప్రాంతంలో ఆప్నా దళ్కు చెప్పుకోదగ్గ ఓటు బ్యాంక్ ఉంది. బీజేపీవైపు కుర్మీ ఓట్లు మళ్లే అవకాశముంది.

అప్నా దళ్ను డాక్టర్ సోనె లాల్ పటేల్ స్థాపించారు. ప్రస్తుత లోక్సభలో ఆ పార్టీకి ఇద్దరు ఎంపీలు ఉన్నారు. మంగళవారం జరిగే కేంద్ర మంత్రివర్గ విస్తరణలో ఆప్నా దళ్ మీర్జాపూర్ ఎంపీ అనుప్రియ పటేల్కు కేబినెట్ బెర్తు దక్కవచ్చని భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement