అమిత్‌ షాకు సర్జరీ

Amit Shah Undergoes Neck Surgery Discharged - Sakshi

న్యూఢిల్లీ : కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అస్వస్థతకు గురవ్వడంతో అహ్మదాబాద్‌లోని కేడీ ఆస్పత్రి వైద్యులు ఆయనకు చిన్నపాటి సర్జరీ చేశారు.  అమిత్‌ షాకు చికిత్సలో భాగంగా పరీక్షించిన వైద్యులు.. ఆయన మెడ వెనుక భాగంలో మైనర్‌ సర్జరీ నిర్వహించి లింఫోమాను తొలగించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

సర్జరీ అనంతరం మధ్యాహ్నం గం. 12.30 గంటల ప్రాంతంలో అమిత్‌ షాను డిశ్చార్జ్‌ చేయడంతో ఆయన సర్కేజ్‌- గాంధీనగర్‌ హైవే రోడ్డులోని తన నివాసానికి వెళ్లారు. కాగా, వ్యక్తిగత పర్యటన నిమ్మిత్తం మంగళవారం రాత్రి అమిత్‌ షా తన కుటుంబ సభ్యులతో కలిసి గుజరాత్‌కు వచ్చారని, ఇప్పుడు ఆయన ఆరోగ్యం బాగానే ఉన్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top