
మైసూరులో గ్రహాంతర వాసులు..!
మైసూరు జిల్లా పిరాయపట్టణ తాలూకాలో గ్రహాంతరవాసులు కనిపించారంటూ వదంతులు వ్యాపించాయి.
మైసూరు(కర్ణాటక): మైసూరు జిల్లా పిరాయపట్టణ తాలూకాలో గ్రహాంతరవాసులు కనిపించారంటూ వదంతులు వ్యాపించాయి. సోమవారం రాత్రి పిరాయపట్టణ తాలూకా సూలకోటె గ్రామానికి చెందిన ఓ రైతు అర్ధరాత్రి తన పొలంలో పంటకు నీరు పెట్టడానికి వెళ్లాడు. అదే సమయంలో ఆకాశం నుంచి భారీ వెలుగుతో వచ్చిన ఫ్లయింగ్ సాసర్(గ్రహాంతర నౌక) భూమిని ఢీ-కొట్టి వెళ్లిపోయింది.
ఈ విషయాన్ని రైతు గ్రామస్థులతో చెప్పడంతో క్షణాల్లోనే ఈ వార్త ఊరంతా వ్యాపించింది. ఈ ఘటన పై విచారణ చేస్తున్నామని శాస్త్రవేత్తలు తెలిపారు.