పెద్దనోట్ల రద్దు తర్వాత దేశంలో హవాలా వ్యాపారం పెరగడంతో ప్రభుత్వం సీబీఐని రంగంలోకి దింపింది.
న్యూఢిల్లీ: పెద్దనోట్ల రద్దు తర్వాత దేశంలో హవాలా వ్యాపారం పెరగడంతో ప్రభుత్వం సీబీఐని రంగంలోకి దింపింది. నవంబరు 8 అనంతరం భారీగా నగదు జమ అయిన బ్యాంకు ఖాతాలను పరిశీలించి అక్రమార్కులను గుర్తించే బాధ్యతను సీబీఐకి అప్పగించింది.
ఇందుకోసం గుజరాత్ కేడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారి ఏకే అరుణ్ శర్మ నేతృత్వంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి (సీబీడీటీ)కి వచ్చే ఫిర్యాదులనూ ఈ బృందమే స్వీకరిస్తుంది. ప్రస్తుతం శర్మ సీబీఐలో ‘బ్యాంకింగ్ సెక్యూరిటీస్ అండ్ ఫైనాన్స్ సెల్’విభాగాధిపతిగా ఉన్నారు.