ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరమైన ఫలితాలను చవిచూడటంతో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి అజయ్ మాకెన్ రాజీనామా చేశారు.
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరమైన ఫలితాలను చవిచూడటంతో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి అజయ్ మాకెన్ రాజీనామా చేశారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రచార రధసారథి బాధ్యతలను తీసుకున్న ఆయన తాజా ఫలితాలతో రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.ఈ ఓటమికి తనదే నైతిక బాధ్యతని ఆయన పేర్కొన్నారు.
గతంలో ఎన్నడూ చూడని ఫలితాలతో బొక్కబోర్లా పడ్డ కాంగ్రెస్ డైలామాలో పడింది. అంతకుముందు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తన ప్రతిష్టను కాపాడుకున్నా.. ఈసారి మాత్రం భిన్నమైన పరిస్థితులను చవిచూసింది.