మహాత్ముడికి ఎయిర్‌ఇండియా వినూత్న నివాళి

Air India Pays Tribute To Father Of Nation With Customised Aircraft - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : మహాత్మ గాంధీ 150వ జయంతిని దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తే ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్‌ ఇండియా జాతిపితను వినూత్నంగా స్మరించింది. గాంధీకి వినూత్న నివాళిగా ఎయిర్‌బస్‌ ఏ 320పై జాతిపిత చిత్రాన్ని ముద్రించింది. ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌లోని ఎయిర్‌ ఇండియా హ్యాంగర్‌ వద్ద విమానం టెయిల్‌పై మహాత్ముని చిత్రాన్ని ముద్రించారు. మొత్తం పెయింటింగ్‌ను సంస్థలో పనిచేసే ఉద్యోగులే ముందస్తు అనుమతితో తీర్చిదిద్దారు. ఒక విమానంపై మహాత్మ గాంధీ బొమ్మను శాశ్వత ప్రాతిపదికన పెయింట్‌ చేయడం ద్వారా జాతిపిత 150వ జయంతోత్సవాలను తమ సంస్థ ఘనంగా నిర్వహించిందని ఎయిర్‌ ఇండియా ప్రతినిధి ధనంజయ్‌ కుమార్‌ పేర్కొన్నారు. మరోవైపు భారతీయ రైల్వేలు సైతం సెంట్రల్‌ రైల్వే జోన్‌ పరిధిలో డీజిల్‌ రైళ్లపై మహాత్ముని చిత్రం పెయింట్‌ చేయడం ద్వారా జాతిపిత 150వ జయంతిని వినూత్నంగా నిర్వహించింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top