చిదంబరం ఆరోగ్యం ఓకే..కానీ !

AIIMS Says To High Court That P Chidambaram Is Fine - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పీ చిదంబరం దాఖలు చేసిన మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు శుక్రవారం తోసిపుచ్చింది. ఏడుగురు సభ్యులతో కూడిన ఎయిమ్స్‌ మెడికల్‌ బోర్డు ఆయన ఆరోగ్యం సంతృప్తికరంగా ఉందని నివేదిక ఇచ్చిన నేపథ్యంలో హైకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. చిదంబరంకు మినరల్‌ వాటర్‌తో పాటు ఇంటి ఆహారాన్నే సమకూర్చాలని కోర్టుకు మెడికల్‌ బోర్డు సూచించింది. ఈ నివేదిక ఆధారంగా చిదంబరానికి సురక్షిత పరిసరాలు ఉండేలా చూడటంతో పాటు దోమల నుంచి రక్షణ కల్పించాలని తీహార్‌ జైలు అధికారులను ఆదేశించింది. ఇక ఇదే కేసులో ప్రధాన బెయిల్‌ పిటిషన్‌ ఈనెల 4న  విచారణకు రానుంది. మరోవైపు ఐఎన్‌ఎక్స్‌ మీడియాపై సీబీఐ కేసులో చిదంబరానికి బెయిల్‌ లభించిన విషయం తెలిసిందే. ఇదే కేసులో ఆయన జ్యుడిషియల్‌ కస్టడీలో ఈడీ విచారణను ఎదుర్కొంటున్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top