‘సర్కార్‌’ వివాదంపై కుదిరిన సయోధ్య

AIADMK's objection to the movie is all about - Sakshi

చెన్నై: తమిళ హీరో విజయ్, కీర్తి సురేశ్‌ జంటగా ప్రముఖ దర్శకుడు మురుగదాస్‌ తెరకెక్కించిన ‘సర్కార్‌’ సినిమా వివాదాల్లో చిక్కుకుంది. తమిళనాడు దిగవంత సీఎం జయలలిత, ఆమె ప్రవేశపెట్టిన ఉచిత పథకాలపై విమర్శనాత్మకంగా ఉన్న కొన్ని సీన్లను తొలగించాలని తమిళనాడు మంత్రులతో పాటు అన్నాడీఎంకే కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఆ సీన్లను తొలగించకుంటే న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో సినిమాలోని అభ్యంతకరమైన సీన్లను తొలగించేందుకు నిర్మాతలు అంగీకరించారు. శుక్రవారం సాయంత్రం నుంచి సదరు సీన్లను తొలగించిన సినిమాను ప్రదర్శిస్తామని వెల్లడించారు. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top