గుజరాత్లోని పోర్బందర్ తీరంలో అనుమానస్పదంగా కనిపించిన పడవను ఆదివారం భద్రత బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.
అహ్మదాబాద్: గుజరాత్లోని పోర్బందర్ తీరంలో అనుమానస్పదంగా కనిపించిన పడవను ఆదివారం భద్రత బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. అందులో ప్రయాణిస్తున్న ఇద్దరు విదేశీయులను అరెస్ట్ చేశారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఇదిలావుండగా, పాకిస్తాన్ నుంచి 10 మంది ఉగ్రవాదులు చొరబడ్డారని అనుమానిస్తున్నట్టుగా కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించడంతో గుజరాత్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేసింది.
గుజరాత్ తీర ప్రాంతంలో గత మూడు నెలల కాలంలో పాక్ నుంచి అక్రమంగా చొచ్చుకొచ్చిన ఐదు మత్స్యకారుల పడవలను భారత భద్రత అధికారులు పట్టుకున్నారు. ఈ ఘటనలకు సంబంధించి భద్రత బలగాలు కేంద్రానికి నివేదిక సమర్పించాయి.