
శ్రీనగర్: కశ్మీర్‌లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో దాదాపు 70 శాతం వార్డుల్లో పోలింగ్ జరగలేదని ఓ నివేదికలో వెల్లడైంది. కొన్ని చోట్ల కనీసం ఎవరూ నామినేషన్ వేయలేదు. మరికొన్ని చోట్ల ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో పోలింగ్ జరగలేదు. కశ్మీర్ ఎన్నికల విభాగం గణంకాల ప్రకారం 10 జిల్లాల్లోని 40 మున్సిపాలిటీల్లో 598 వార్డులకు ఎన్నికలు జరిగాయి. ఇందులో 186 వార్డుల్లోనే పోలింగ్ జరిగింది. మిగతా 412 (68.89 శాతం) వార్డుల్లో ఎటువంటి ఓటింగ్ జరగలేదు. తీవ్రవాదులతో ముప్పుపొంచి ఉన్న నేపథ్యంలో భద్రత కారణాల దృష్ట్యా అభ్యర్థుల వివరాలను రహస్యంగా ఉంచింది. దీంతో కొందరు అభ్యర్థులు ప్రచారానికి దూరంగా ఉండగా.. మరికొందరు అజ్ఞాతంలో గడిపారు. ఎన్నికలు జరిగిన 598 వార్డుల్లో 231 (38.62) వార్డుల్లో ఒక్కరే నామినేషన్ దాఖలు చేయగా వారే గెలుపొందినట్లు ప్రకటించారు