మరో స్కూల్‌లో దారుణం.. గార్డ్స్‌ పనే! | 4-Year-Old Sexually Assaulted In Bengaluru School | Sakshi
Sakshi News home page

మరో స్కూల్‌లో దారుణం.. గార్డ్స్‌ పనే!

Sep 13 2017 10:51 AM | Updated on Sep 19 2017 4:30 PM

మరో స్కూల్‌లో దారుణం.. గార్డ్స్‌ పనే!

మరో స్కూల్‌లో దారుణం.. గార్డ్స్‌ పనే!

స్కూళ్లలో దారుణ సంఘటనలు వెలుగు చూస్తున్నాయి. మొన్న ఢిల్లీలో చిన్నారిపై లైంగికదాడి.. అంతకుముందు గుర్గావ్ స్కూల్లో ఏడేళ్ల బాలుడి హత్య ఘటన‌ చోటుచేసుకోగా.. నేడు బెంగళూరులో అలాంటి దారుణమే చోటు చేసుకుంది.

బెంగళూరు : స్కూళ్లలో దారుణ సంఘటనలు వెలుగు చూస్తున్నాయి. మొన్న ఢిల్లీలో చిన్నారిపై లైంగికదాడి.. అంతకుముందు గుర్గావ్ స్కూల్లో ఏడేళ్ల బాలుడి హత్య ఘటన‌ చోటుచేసుకోగా.. నేడు బెంగళూరులో అలాంటి దారుణమే చోటు చేసుకుంది. బెంగళూరులోని ఓ ప్రైవేట్‌ స్కూల్‌లో నాలుగేళ్ల బాలికపై లైంగిక దాడి జరిగింది. పాఠశాలకు భద్రతా సిబ్బందిగా ఉన్నవారిలో ఎవరో ఒకరు ఈ పనిచేసి ఉంటారని అనుమానిస్తున్నారు.

బాలికకు పరీక్షలు జరిపిన ఎంఎస్‌ఆర్‌ రామయ్య ఆస్పత్రి వైద్యులు కూడా పాపపై లైంగిక దాడి జరిగిందని స్పష్టం చేశారు. తల్లిదండ్రుల ఫిర్యాదుల మేరకు దసరాహళ్లి ప్రాంతంలో ఉంటూ స్కూల్‌లో సెక్యూరిటీ గార్డ్స్‌గా పనిచేస్తున్న ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు పోలీసులు చెప్పారు. వారిని ప్రస్తుతం విచారిస్తున్నామని, బాలిక పూర్తి స్థాయిలో కోలుకున్న తర్వాత నిందితుడిని గుర్తించే ఏర్పాట్లు చేయనున్నట్లు వెల్లడించారు.

Advertisement