ఓవర్ టేక్ చేశాడని ఎమ్మెల్సీ కొడుకు చంపేశాడు! | 25-year-old shot dead allegedly for overtaking politician's car in Bihar's Gaya | Sakshi
Sakshi News home page

ఓవర్ టేక్ చేశాడని ఎమ్మెల్సీ కొడుకు చంపేశాడు!

May 8 2016 9:55 AM | Updated on Sep 3 2017 11:41 PM

ఓవర్ టేక్ చేశాడని ఎమ్మెల్సీ కొడుకు చంపేశాడు!

ఓవర్ టేక్ చేశాడని ఎమ్మెల్సీ కొడుకు చంపేశాడు!

బిహార్లో దారుణం చోటుచేసుకుంది. ఓ రాజకీయ నాయకుడి వాహనాన్ని ఓవర్ టేక్ చేశాడని కారణంతో ఓ యువకుడిని కాల్చి చంపారు.

గయ: బిహార్లో దారుణం చోటుచేసుకుంది. ఓ రాజకీయ నాయకుడి వాహనాన్ని ఓవర్ టేక్ చేశాడని కారణంతో ఓ యువకుడిని కాల్చి చంపారు. గయ వద్ద ఈ ఘటన జరిగింది. ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఆదిత్య సచ్ దేవా(25) అనే యువకుడు గయ సమీపంలో జేడీయూ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ బిండీ యాదవ్ కొడుకు కారును ఓవర్ టేక్ చేస్తూ వెళ్లాడు. దాంతో అతడు తన వద్ద ఉన్న రైఫిల్ తో కాల్చడంతో ఆ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. కాగా దీనిపై బిండీయాదవ్ స్పందించారు.

తొలుత ఆ యువకుడికి తన కుమారుడికి మధ్య గొడవ జరిగిందని, తనను తాను రక్షించుకునేందుకు తన కుమారుడు తుపాకీ బయటకు తీశాడని, పొరపాటున అది పేలి ఆ యువకుడు చనిపోయాడని చెప్పారు. మరో జేడీయూ నేత స్పందిస్తూ.. ఏ ఒక్కరు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడానికి వీల్లేదని అలా తీసుకుంటే శిక్ష పడుతుందని, అలాంటి రక్షించాలని చూడటం కూడా నేరమవుతుందని చెప్పారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement