బస్సులోంచి బయటకు లాక్కెళ్లి... | 18-year-old girl dragged out of bus, stabbed to death in Madhya Pradesh | Sakshi
Sakshi News home page

బస్సులోంచి బయటకు లాక్కెళ్లి...

Oct 30 2016 9:40 AM | Updated on Oct 8 2018 3:17 PM

బస్సులోంచి బయటకు లాక్కెళ్లి... - Sakshi

బస్సులోంచి బయటకు లాక్కెళ్లి...

నడుస్తున్న బస్సులోంచి యువతిని బయటకు లాగి దారుణంగా పొడిచి చంపిన ఘటన మధ్యప్రదేశ్ లోని సిద్ధి జిల్లాలో చోటు చేసుకుంది.

భోపాల్: నడుస్తున్న బస్సులోంచి యువతిని బయటకు లాగి దారుణంగా పొడిచి చంపిన ఘటన మధ్యప్రదేశ్ లోని సిద్ధి జిల్లాలో చోటు చేసుకుంది. మాడ్వాస్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోట్రా గ్రామంలో జరిగిన ఘటన స్థానికంగా సంచలనం రేపింది. డిగ్రీ విద్యార్థిని సంజూ(18)ను నిందితుడు శివేంద్ర సింగ్ అలియాస్ శిబ్బు పొడిచి చంపాడు. కాలేజీ నుంచి ఇంటికి తిరిగి వస్తున్న సంజూను బస్సులోంచి దౌర్జన్యంగా బయటకు లాక్కొచ్చి ఈ దురాగతానికి పాల్పడ్డాడు. అడ్డుకోబోయిన బస్సు కండక్టర్ ను కూడా అతడు కత్తితో పొడిచాడు.

ఎవరైన తనను అడ్డుకుంటే పెట్రోల్ పోసి బస్సను తగలబెడతానని ప్రయాణికులను శిబ్బు బెదిరించాడని పోలీసులు తెలిపారు. పలుమార్లుకత్తితో పొడవడంతో సంజూ ఘటనా స్థలంలోనే ప్రాణాలు విడిచిందని చెప్పారు. నిందితుడు పరారీలో ఉన్నాడని, అతడిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీసులు తెలిపారు. కొద్దిరోజులుగా సంజూను శిబ్బు వేధిస్తున్నాడని మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపారు. నిందితుడిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ సంజూ మృతదేహంతో ధర్నాకు దిగారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement